WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

UNINSTALL THESE DANGEROUS ANDROID APPS

UNINSTALL THESE DANGEROUS ANDROID APPS

గూగుల్‌ ప్లే  స్టోర్‌లో  హానికరమైన యాప్స్‌

1.3 మిలియన్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇప్పటికే ఇన్‌స్టాల్‌

15 యాప్స్‌ను  గుర్తించిన  పరిశోధనా  సంస్థ సోఫోస్‌

ఆండ్రాయిడ్‌  యూజర్లకు  హెచ్చరిక. గూగుల్‌ ప్లే స్టోర్‌ లోని కొన్ని యాప్స్‌ చాలా హానికరమైనవిగా  ఉన్నాయని తక్షణమే  వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని ఒక పరిశోధన సంస్థ వినియోగదారులను తాజాగా హెచ్చరిస్తోంది. వివిధ ఉపయోగరమైన యాప్స్‌తో పాటు కొన్ని హానికరమైన యాప్స్‌ కూడా ప్లేస్టోర్‌లో దాక్కుని  ఉన్నాయని బ్రిటిష్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ వెల్లడించింది. దాదాపు 15  పైగా ఇలాంటి యాప్స్‌ను తన పరిశోధనలో గుర్తించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాటిని ఇప్పటికే  ఇన్‌స్టాల్‌ చేసుకుని వుండి వుంటే..వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఈ మోసపూరితమైన యాప్స్‌ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పుతో పాటు, వాటి డెవలపర్‌ అక్రయ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని  పేర్కొంది.  పరిశోధనా సంస్థ సోఫోస్  ప్రకారం  వీటిని  ప్రస్తుతం గూగుల్‌  తొలగించినప్పటికీ, ఈ 15 యాప్స్‌ 1.3 మిలియన్లకు పైగా  మొబైల్స్‌లో  డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది. 2019 జనవరి- జూలై మధ్య  ఇవి ఇన్‌స్టాల్‌ అయ్యాయని తెలిపింది.


  • ఇమేజ్ మ్యాజిక్
  • జెనరేట్‌ ఈవ్స్‌
  • సేవ్‌ ఎక్స్‌పెన్స్‌
  • క్యూఆర్‌ ఆర్టిఫాక్స్‌
  • ఫైండ్‌ యువర్‌ మొబైల్‌
  • స్కావెంజర్  స్పీడ్‌
  • ఆటో కటౌట్ ప్రో
  • రీడ్‌ క్యూఆర్‌ కోడ్
  • ఫ్లాష్ కాల్స్ & మెసేజ్‌
  • ఇమేజ్‌ ప్రాసెసింగ్‌
  • ఆటో కటౌట్
  • ఆటో కటౌట్ 2019

ఈ హానికరమైన అనువర్తనాలను వదిలించుకోవడానికి  సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్స్‌, నోటిఫికేషన్‌లోకి వెళ్లి, రీసెంట్‌ యాప్స్‌ చెక్‌చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే వాటిని అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది.  ముఖ్యంగా అవసరం లేకపోతే ఎలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని యూజర్లకు సూచిస్తోంది.