WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

DASASA AND SANKRANTHI HOLIDAYS SUFFIX AND PREFIX INSTRUCTIONS

DASASA  AND SANKRANTHI HOLIDAYS SUFFIX AND PREFIX  INSTRUCTIONS

దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. prefix పై వివరణ...

దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.

దసరా/సంక్రాంతి సెలవులు 10 లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ , బడి తెరిచేరోజు (రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.

దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.

గమనిక :- ఈ సంవత్సరం దసరా సెలవులు 28.9.19 నుంచి 09.10.19 వరకు అనగా మొత్తం 12 రోజులు.కావున 27వ తేదీ ( చివరి రోజు ) మరియు 10వ తేదీ ( బడి తెరిచే రోజు ) తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయిన ఈ 12 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.