WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

DSC 2018 CERTIFICATE VERIFICATION NEWS

DSC 2018  CERTIFICATE VERIFICATION


జూలై 26, 27, 28 మరియు 29 తేదీల‌లో  డిఎస్సీ -2018 ప్రొవిజిన‌ల్ సెల‌క్ష‌న్ అభ్య‌ర్థుల స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్


డిఎస్సీ -2018 ప్రొవిజిన‌ల్ సెల‌క్ష‌న్ జాబితాలో వున్న టిజిటి, స్కూల్ అసిస్టెంట్ (ఎస్.ఏ. హిందీ,  తెలుగు మిన‌హా) అభ్య‌ర్థుల వివ‌రాలు సీఎస్ ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్ లో వుంచ‌డ‌మైంద‌ని పాఠ‌శాల విద్యా శాఖ క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం క‌మీష‌నర్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  మంగ‌ళ‌వారం ప్రొవిజ‌న‌ల్ సెల‌క్ష‌న్ జాబితాతో వున్న అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు సంక్షిప్త స‌మాచారం పంపుతామ‌ని, స‌మాచారం ప్ర‌కారం జూలై 24, 2019 అదేవిధంగా జూలై 25 తేదీల్లో త‌మ‌త‌మ  స‌ర్టిఫికేట్ల‌ను వెబ్ సైట్ లో తప్ప కుండా అప్ లోడ్ చేయాలనీ  పేర్కొన్నారు.

అదే విధంగా  జూలై 26, 27 తేదీల‌లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్.ఏ. హిందీ,  తెలుగు మిన‌హా) అభ్య‌ర్థుల‌కు, జూలై 28, 29 తేదీల్లో టిజిటిల‌కు  స‌ర్టిఫికేట్ల‌ వెరిఫికేష‌న్ వుంటుంద‌ని,  నిర్దేశించిన కేంద్రాల్లో స‌ద‌రు అభ్య‌ర్థులు హాజ‌రు కావాల్సి వుంటుంద‌ని పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.