Friday, October 8, 2021

AP municipal teachers promotions

 మునిసిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూలు విడుదల... 

        

 సీనియారిటీ జాబితాల ఫైనలైజ్ 11.10.2021 మొదలు 8.11.2021 న పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసిన పురపాలక శాఖ సంచాలకులు.


        స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) పదోన్నతుల పై ఎస్జీటీలు మరియు స్కూల్ అసిస్టెంట్ లు వేసిన కోర్టు కేసులు, యధాతథ స్థితి పాటించాలంటూ గౌ. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తాజాగా...  పదోన్నతుల పై ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన కేసులో గౌ. హైకోర్టు వారు "పదోన్నతులన్నీ హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయి" అని మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో...  కేసు దసరా సెలవుల అనంతరం (28.10.2021)కు వాయిదా పడిన కారణంగా,  కోర్టు తుది ఉత్తర్వులు మేరకు ఆయా కేటగిరీ లకు పదోన్నతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నందున.., ఈలోగా ప్రధానోపాధ్యాయ కేటగిరీకి అన్యాయం జరగరాదనే ఉద్దేశంతో హెచ్.ఎమ్.ల పదోన్నతి షెడ్యూల్ను విడుదల చేసినట్లు పురపాలక సంచాలకులు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

0 comments:

Post a Comment