WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

SPECIAL HALF PAY LEAVE DETAILS

ప్రత్యేక అర్ధవేతన సెలవు 

లెప్రసీ, టి.బి. క్యాన్సర్, మానసిక అనారోగ్యం గుండెజబ్బులు మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాధులతో దీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు. సంబంధిత వైద్య నిపుణుని ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకొని పూర్తిచేతనం పొందవచ్చు. (GO.No.188 Findt 30-7-1973), (GO No 386 Fin dt.6-9-1976) (GO No. 20 F& P. dt. 25.01 1977).

గుండెజబ్బులకు (GO No 449 Fin dt. 28-10-76) 

మూత్రపిండాల వైఫల్యానికి (G.O.No 268 F&P; 25.01.1977)

ముఖ్యవిషయాలు :

* సెలవులో వెళ్లేదానికి ముందురోజు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి. (FR -87). ఏకారణం వల్లనైనా సెలవు మధ్యలో చేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెంపు అనంతరం డ్యూటీలో చేసిన తేదీ నుండి మాత్రమే ఆర్థిక లాభం వర్తింపజేస్తారు.

* 6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు హెచ్.ఆర్.ఎ. చెల్లించబడుతుంది. (జి.ఓ. -నం. 25 ఆర్ధిక తేది 19.03.2011)

* కుష్టు గుండెజబ్బు, క్యాన్సర్, ఎయిడ్స్ మానసిక ఆరోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు హెచ్.ఆర్.ఎ. చెల్లించబడుతుంది. (జి.ఓ నం. 29 ఆర్థిక, తేది. 09.08.2011) * ఒకసాద్ మంజూరు చేయబడిన సెలవు పెట్టి పరిస్థితుల్లోనూ మార్చుచేయబడదు.