2021-22 విద్యా సంవత్సర నిర్వహణకు సంబంధించి కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాలు సంఖ్య 151/A&I/2021 తేదీ 08/09/2021 మేరకు.....
పాఠశాల సంసిద్ధత కార్యక్రమం
01-9-21 నుండి 8-10-2021 వరకు ఆరు వారాల పాటు సంసిద్ధతా కార్యక్రమం నిర్వహించ వలెను
✒️ విద్యార్థుల యొక్క స్థాయిని పాఠశాల ప్రారంభం లో నిర్వహించిన బేస్ లైన్ పరీక్ష ఆధారంగా నిర్ధారించుకొన వలెను.
✒️ కార్యక్రమ నిర్వహణకు జిల్లా సాధారణ పంపిణీ సరఫరా చేయబడిన వర్క్ బుక్ లను ఉపయోగించడం వలెను.
స్నేహపూర్వక వాతావరణం కల్పించడం
పాఠశాలలోని వివిధ రకాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని ముఖ్యంగా నాడు-నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి పాఠశాలలు.. విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చేయవలెను
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం
ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని నివాస ప్రాంతాలలో, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సహకారంతో.. బడిబయట విద్యార్థులను గుర్తించి వారందరూ బడిలో చేరునట్లుగా చూడవలెను.
కోవిడ్ SOP పాటించడం
✒️ పాఠశాల ప్రాంగణంలో తప్పనిసరిగా కోవిడ్ SOP ను అనుసరించవలెను.
✒️ పాఠశాల లో సిబ్బంది లేదా విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ సోకినట్లయితే వెంటనే సదరు సమాచారాన్ని తప్పనిసరిగా మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేయవలెను
0 comments:
Post a Comment