Thursday, August 12, 2021

preparedness of schools,mbnn and jvk meeting details

 నేటి (12/8/21) Principal Secretary, School Education, Director of School Education, SPD, Advisor MBNN గార్ల Zoom conference విశేషాలు

1. 16వ తేదీన అన్ని పాఠశాలలు, అన్ని తరగతులు ప్రారంభించాలి.

2. మొదటి దశ నాడు నేడు పాఠశాలల ప్రారంభోత్సవం ది. 16/8/21 న ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో జరగాలి

3. గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన JVK kits పంపిణీ చేశాం.. ఇప్పుడు 2 నెలలు ముందుగా పంపిణీ చేస్తున్నాం..వస్తువుల సరఫరా లో కొద్దిగా జాప్యం జరుగుతుంది కావున ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని ముందుగా వచ్చిన వస్తువులు టిక్ చేసుకొని..రాని వస్తువులు గుర్తుపెట్టుకొని రోజుకు 30 నుండి 40 మందికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బయోమెట్రిక్ తీసుకుంటూ పంచాలి. రాని వస్తువులు వచ్చిన తర్వాత విధిగా పంచాలి.

4. కొత్తగా చేరిన వారికి సెప్టెంబర్ 1నుండి పంపిణీ జరుగును.

5. షూ పంపిణీ లో తగు జాగ్రత్తలు తీసుకొని వారికి సరిపడే సైజు ఇవ్వాలి. సరిపోని వాని విషయంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఎక్స్చేంజి మేళా నిర్వహించబడును.

6. JVK kits పంపిణీ ఆగస్టు 16 నుండి 31లోగా రోజుకు 30 నుండి 40 మంది చొప్పున ఒత్తిడి లేకుండా పంపిణీ చేయాలి. అందరూ విద్యార్థులకు ఉన్నాయి..అందరికీ ఇస్తాము అనే మెస్సెజ్ విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు వెళ్ళాలి.

7. Uniform cloth 3జతలు.. కావున ఇచ్చేముందు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వాలి..అలానే పెద్ద పిల్లలు, చిన్న పిల్లల మధ్య సైజు అక్కడి పరిస్థితులను బట్టి మీరే సర్దుబాటు చేసుకొని ఇవ్వాలి.

8. JVK kits ఇక మీకు రావని ఎవ్వరినీ నిరాశపరచవద్దు..బఫర్ స్టాక్ జిల్లా కేంద్రంలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరికీ ఇవ్వబడతాయి.

9.9,10తరగతుల యూనిఫామ్ ఆగస్టు నెలాఖరు లోగా తప్పక పంపిణీ జరుగుతుంది

10. నాణ్యత సరిగా లేని వస్తువులు తిరిగి ఇచ్చి నాణ్యమైనవి పిల్లలకు ఇవ్వండి. నాణ్యమైన వస్తువులు తీసుకొనుట పిల్లల హక్కు.

11. ఈ నెలాఖరు లోగా 6నుండి 10 తరగతులు విద్యార్థులకు Oxford Dictionaries పంపిణీ జరుగును..అలానే SCERT వారు develop చేసిన Pictorial Dictionaries కూడా వీలైనంత త్వరగా పంపిణీ జరుగును.

12. సెప్టెంబర్ 1వ తేదీ నుండి నాడు నేడు రెండవ దశ పనులు ప్రారంభం అవుతాయి. Revised MBNN phase 2 list మరో 4 రోజుల్లో వస్తుంది.

13. పాఠశాలల తరగతి గదులు, ఆవరణ 15వ తేదీ లోగా పరిశుభ్రం చేసుకొని 16వ తేదీన తరగతులు నిర్వహణ కు సంసిద్ధం చేసుకోండి. ఎక్కడా వ్యర్ధమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి.

14. వర్షాకాలం ప్రారంభం అయ్యింది కావున పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచాలి. కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయాలి.

0 comments:

Post a Comment