వినూత్నంగా AP స్కూల్ క్యాలెండర్
🌺నిర్ణీత బరువులోనే స్కూల్ బ్యాగ్
🌺స్కూల్ పెర్‌ఫార్మెన్సు రిజిస్టర్ల ఏర్పాటు
🌺ప్రతి స్కూలులో అకడమిక్ పెర్ఫార్మెన్స్ రిజిస్టర్లను నిర్వహించాలి.
🌺పరీక్ష వివరాలు, విద్యార్థుల మార్కులను అందులో నమోదుచేయాలి.
🌺 విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి.
🌺టీచర్లు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
🌺 పాఠ్యబోధన ఎలా సాగుతోందో తెలుసుకునేలా క్లాస్ అబ్జర్వేషన్ రిజిస్టర్ పెట్టాలి.
🌺స్కూలుకు సందర్శకులు వస్తే వారి అభిప్రాయాలు నమోదు చేయాలి.
🌺 స్కూలులోని మౌలిక సదుపాయాలు, వాటి స్థితిగతులపైనా రికార్డులు నిర్వహించాలి.
💐నిర్ణీత బరువులోనే స్కూల్ బ్యాగ్
🌺విద్యార్థి పుస్తకాల బ్యాగ్ బరువు నిర్ణీత ప్రమాణాల్లోనే ఉండాలి.
🌺అవి పెరగకుండా చర్యలు తీసుకోవాలి.
🌺1, 2 తరగతుల వారికి 1.5 కిలోలు.. 3-5 తరగతుల వారికి 2-3 కిలోలు.. 6-8 తరగతుల వారికి 4 కిలోలు.. 8-9 తరగతుల వారికి 4.5 కిలోలు.. 10వ తరగతి వారికి 5 కిలోలు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఎస్సీఈఆర్టీ సూచిస్తోంది.
💐ఉపాధ్యాయుల పాత్ర ఇలా..
🌺తరగతి గదిలో విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేలా బోధన సాగించాలి.
🌺మూల్యాంకన పద్ధతులను అనుసరించి విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారికి తగిన సహకారం అందించాలి.
🌺పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై వారి భాగస్వామ్యాన్ని సూచించాలి.
🌺పేరెంట్స్ కమిటీలను సమావేశపరిచి వారికి విద్యార్థుల స్థితిగతులను, జిల్లాస్థాయిలోని ప్రమాణాల గురించి వివరించాలి.
🌺విద్యార్థులు అంతకుముందు తరగతుల అంశాలను వినకపోయి ఉంటే వాటిని ప్రత్యేకంగా బోధించాలి.
💐తల్లిదండ్రుల పాత్ర ఇలా..
🌺విద్యార్థులకు ఇచ్చే హోంవర్క్, వాట్సప్ పాఠాలు, ఇతర ప్రక్రియలను ఇంటి నుంచి చేసేలా సహకరించాలి.
🌺దీక్షా యాప్ ద్వారా బోధనాంశాలపై అవగాహన పెంచుకునేలా చేయాలి.
🌺ఆటపాటలు, పుస్తక పఠనం వంటి పాఠ్యేతర అంశాలనూ చేయించాలి.
🌺ఇక స్థానిక పంచాయతీ, మున్సిపాల్టీ, తదితర సంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలనూ క్యాలెండర్లో వివరించారు.
🌺కమ్యూనిటీ యాక్టివిటీల కింద రీడింగ్ మేళాలు వంటివి నిర్వహించాలి.
0 comments:
Post a Comment