WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

GENERAL RULES OF THE NATIONAL FLAG

 🌻 జాతీయ జెండా సాధారణ నియమాలు


💧  జాతీయ జెండా చేనేత (ఖాదీ, కాటన్‌, సిల్క్‌) గుడ్డతో తయారైంది కావాలి.

💧  జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో వుండాలి.

💧 6300 x 4200 మి.మీ నుండి 150 x 100 మి.మీ వరకు మొత్తం 9 రకాల సైజ్‌ల జెండాలు పేర్కొనబడివి.

💧  ప్లాస్టిక్‌ జెండాలు వాడకూడదు.

💧 పై నుండి క్రిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో వుండాలి.

💧 జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి.

💧 జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి.

💧 జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు.



🌻జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి.


💧 జెండా పైన ఎలాంటి రాతలుగాని, ప్రింటింగ్‌ గాని వుండకూడదు.

💧 ఇతర జెండా లతో కలిపి చేయాల్సివస్తే, జాతీయ జెండా  మిగిలిన వాటి కంటె కొంచెం ఎత్తుగా వుండాలి. ప్రధర్శనలో అయితే మిగిలిన వాటి కంటె మధ్యలో ఒకడుగు ముందు వుండాలి.

💧 జెండా  ఎప్పుడూ నిటారుగానే వుండాలి. క్రిందికి వంచకూడదు. 



🍄పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చెయ్యాల్సినవి


💧 పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో మూడు వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. నాలుగోవైపు మధ్యలో హెడ్మాష్టర్‌, స్టూడెంట్స్‌ లీడర్‌, జెండా ఎగురవేసే వ్యక్తి (హెడ్మాష్టర్‌ కాకపోతే) మూడు స్థానాల్లో నిలబడాలి.

💧 విద్యార్థులను తరగతుల వారీగా 10 మందినొక స్క్వాడ్‌గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్‌ లీడర్‌ వరుస ముందు నిలబడాలి వరుసల మధ్యన, విద్యార్థుల మధ్యన 30 ఇంచ్‌ల దూరం వుండాలి.

💧 క్లాస్‌ లీడర్‌లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్‌ లీడర్‌కి సెల్యూట్‌ చేయాలి. స్కూల్‌ లీడర్‌ వెళ్లి హెడ్మాష్టర్‌కి సెల్యూట్‌ చేయాలి. ఆ తర్వాత జండాను ఎగురవేయాలి.

💧 జెండా ఎగురవేయటానికి ముందు స్కూల్‌ లీడర్‌ విద్యార్థ్థులను అటెన్షన్‌లో వుంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్‌ చేయించి కొద్ది సేపు అలా వుంచి ఆర్డర్‌ చెప్పి అటెన్షన్‌లో వుంచాలి.

💧 అటెన్షన్‌ వుంచి జాతీయ గీతం ఆలపించాలి, ఆతర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్మాష్టర్‌ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి.

💧 జాతీయ దినోత్సవాల్లో జెండా వందనం సందర్భంలో చేయాల్సిన ప్రతిజ్ఞ.


[Rule No.2.3-VII లో పేర్కొనబడింది.]

 "I Pledge allegiance to the National  Flag and to the Sovereign Socialist Secular Democratic Republic for which it stands"

🍄అనుభవాలే ఆచరణకు మార్గాలు

    

💧 జెండా వందనం నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతోంది.

💧 Flag Code of India సెక్షన్‌ v రూల్‌ నంబర్‌ 3.30 ప్రకారం రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు వుంచి ఎగుర వేయవచ్చు.

💧 జెండా ఎగుర వేయటానికి ముందు కొబ్బరికాయలు కొట్టడం, అగర్‌ బత్తీలు వెలిగించటం, జాతీయ నేతలు, కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టటం, బొట్లు పెట్టడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటాంటివి దేశ రాజధాని ఎర్రకోట వద్ద గాని, రాష్ట్ర రాజధానిలోగాని, జిల్లా కలెక్టరేట్‌లోగాని చేయబడవు. ప్రభుత్వ పరంగా పై స్థాయిలో పాటించని పద్ధతులను పాఠశాలల్లోనూ పాటించ కూడదు.

💧 పాఠశాలల్లో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలో ప్రభుత్వం  విడుదల చేసే ఉత్తర్వులను  అనుసరించాలి .

💧 జాతీయ జెండాని ఎగరేసే పోల్‌ గట్టిగా వుండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడివడే విధంగా వుండాలి. కొన్ని చోట్ల జెండా కర్రపడిపోవటం, పైకి  పైకి వెళ్లిన తర్వాత ముడివిడకపోవటం, మళ్లీ కిందికి లాగటం, కాషాయ రంగు కిందికి వుండటం వంటి తప్పులు జరుగుతుంటాయి.

💧 సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే వుండి జెండాని జాగ్రతగా క్రిందికి దించి మడత పెట్టి బీరువాల్లో వుంచటం హెడ్మాష్టర్‌ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదోటైమ్‌లో జెండా క్రింద పడటం, రాత్రికూడ ఎగురుతుండటం వంటి తప్పిదాల వలన హెడ్మాష్టర్‌లు సస్పెండ్‌ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జెండావందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి.