Tuesday, August 24, 2021

EMPLOYEES DOUBTS AND ANSWERS

 EMPLOYEES DOUBTS AND ANSWERS

సందేహాలు - సమాధానాలు

1. ❓ప్రశ్న:

నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి??

ప్రస్తుతం  TIS మరల ENABLE చేసారు .  బాగా పనిచేస్తుంది మీ వివరాలను అప్డేట్ చేసుకోగలరు 

✅జవాబు:

జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.

•••••••••

 2.❓ప్రశ్న:

నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??

✅జవాబు:

FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.

•••••••••

3. ❓ప్రశ్న:

డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??

✅జవాబు:

FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.

FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.

•••••••••

4. ❓ప్రశ్న:

అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

✅జవాబు:

టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.

కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.

•••••••••

5. ❓ప్రశ్న::

నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??

✅జవాబు:

చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.

6.❓ ప్రశ్న:*

CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి?

*✅జవాబు:*

ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.

*7. ❓ ప్రశ్న:*

వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు?

*✅జవాబు:*

మెమో.14568, తేదీ:31.1.2011 ప్రకారం పే, డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.

*8. ❓ ప్రశ్న:*

ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు?

*✅జవాబు:*

ఇంటి మరమ్మతులు, విస్తరణకు మూలవేతనానికి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ, ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.

*9. ❓ ప్రశ్న:*

DSC నియామకాలలో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

*✅జవాబు:*

మొత్తం ఖాళీల లో 80% కేవలం స్థానికులకు, మిగిలిన 20% ఖాళీలు ఓపెన్ కాంపిటేషన్ కింద స్థానికులకి, స్థానికేతరులకి కలిపి ఇస్తారు.

*10. ❓ ప్రశ్న:*

ఒక టీచర్ వైద్య కారణాలపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు. అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా?

*✅జవాబు:*

వాయిదా పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే, నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.

11.❓  ప్రశ్న:

ఒక ఉపాద్యాయుడు తాను సోమవారం రాను అని శనివారం ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసి CL వేయమని కోరడం జరిగింది.. కాని కొన్ని కారణాల వల్ల అతడు తిరిగి సోమవారం స్కూల్ వెళ్లాలనుకొని ఉదయం స్కూల్ టైం కు ముందే సమాచారం అందిచాడు.. కాని శనివారం రోజే సోమవారం నాడు CL అని అడ్వాన్స్ గా అటెండెన్స్ రిజిస్టర్ లో వేయవచ్చా.?

✅ జవాబు:

వేయకూడదు. CL కు ముందస్తుగా దరఖాస్తు చేసుకొన్నప్పటికీ CL గ్రాంట్ చేసినా మరుసటిరోజు పాఠశాల సమయంలో మాత్రమే అటెండెన్స్ రిజిస్టర్ నందు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సారి వారు CL క్యాన్సిల్ చేసుకోవచ్చు

12.❓ ప్రశ్న:

ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి?

✅ జవాబు:

జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.

13. ❓ ప్రశ్న:

ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా?

✅ జవాబు:

అవును. ఏ పరీక్ష రాయాలన్నా పైఅధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.

14. ❓ ప్రశ్న:

ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా? అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా?

✅ జవాబు:

మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు. sa గా చేరిన సంవత్సరంనకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.

15. ❓ ప్రశ్న:

నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా?

✅ జవాబు:

పెన్షన్ ను ఆదాయంగా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

16.❓  ప్రశ్న:

నేను బదిలీ అయ్యాను. పాత మండలంలో చాలా ఎంట్రీలు వేయలేదు. ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు. ఆ ఎంట్రీల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి?

✅ జవాబు:

సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.

17. ❓ ప్రశ్న:

నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను. నేను ఆ ఉద్యోగంలో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా?


✅  జవాబు:

జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టులో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది. అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

18. ❓ ప్రశ్న:

బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా?

✅  జవాబు:

6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.

19. ❓ ప్రశ్న:

నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్టపోతాను?

✅  జవాబు:

జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 ఇయర్స్ పైన జీతనష్టపు సెలవుకాలం పెన్షన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

20. ❓ ప్రశ్న:

నేను, నా భర్త ఇద్దరం టీచర్లం. నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు. దీనికి DA ఇవ్వరా?


✅  జవాబు:
జీఓ.51, తేదీ: 30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు. మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.


21. ❓ ప్రశ్న:
CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాల్ చేసుకోవచ్చు?

✅  జవాబు:
మూడు సందర్భాలలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో, మరణించిన సందర్భంలో, పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో


22. ❓ ప్రశ్న:
ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు. అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు?

✅  జవాబు:
అతనికి 2015, 2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి, 2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి మంజూరు చేస్తారు.

23. ❓ ప్రశ్న:*
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా?

✅  జవాబు:
వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.


24. ❓ ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా?

✅  జవాబు:
అవకాశం లేదు.


25. ❓ ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి?

✅  జవాబు:
CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

0 comments:

Post a Comment