ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం - ముఖ్యాంశాలు
1) ప్రాథమిక పాఠశాలలు - 1:20 -34 వేల పాఠశాలలకు ఉన్న 76 వేల పోస్టులను సర్దుబాటు చేయాలని, ఒక వేళ పోస్టులు మిగిలితే సర్దుబాటు చేస్తామని, విషయాన్ని సి.యం. దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
2) మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ. అంగీకరించే అవకాశం
3) ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
4) అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
5) సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
8) యం. ఎ (తెలుగు) కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి. 3rd మెథడాలజీకి అంగీకారం
చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం
0 comments:
Post a Comment