Saturday, July 18, 2020

EMPLOYEE HEALTH SCHEME (EHS) DETAILS

EMPLOYEES HEALTH SCHEME (EHS) గురించి వివరణ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం.

 ♦(ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌)

 5 డిసెంబర్‌ 2013వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది..

👉జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు. 

♦ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు  హెల్త్ కార్డులు -మార్గదర్శకాలు :

👉రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఫండమెంటల్ నిబంధన ప్రకారము), స్థానిక సంస్థల్లోని ప్రొవిన్షియలై్డ్ గెజిబెడ్, నాన్ గజిబెడ్, క్లాస్-4 స్థాయి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు, అలాగే సర్వీస్ పెన్షనర్లకు, వారి ఆధారితులు లేక ఫ్యామిలీ పెన్షనర్లకు, పునర్నియామకము పొందిన సర్వీసన్ పెన్షనర్లకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత చికిత్స (Cashless Treatment) కొరకు ఆరోగ్య కార్డులను 1 నవంబర్ 2013 నుండి అమలులోకి తెచ్చుటకు విధి విధానాలను, మార్గదర్శకాలను ఆరోగ్య వైద్యశాఖ (G.O.Ms.No. 174, 175 & 176) తేది: 1-11-2013 ఉత్తర్వుల ద్వారా విడుదల చేసింది.

 @ ఈ ఉత్తర్వులు  CGHS (Central Govt. Health Scheme), ESIS, Railways, RTC, పోలీస్ శాఖకు అమలు చేస్తున్న ఆరోగ్య భద్రతా పథకము క్రింద వచ్చు ఉద్యోగులకు, లా ఆఫీసర్స్, అధ్వకేట్ జనరల్స్ కు, స్టేట్ ప్రాసిక్యూటర్స్ కు, ప్రభుత్వ ప్లీడర్లకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కు, క్యాజువల్ మరియు దినసరి భత్యముపై పనిచేయు కార్మికులకు, స్వతంత్రంగా ఉంటున్న పిల్లలకు, పెంపుడు తల్లిదండ్రులు బ్రతికి ఉండగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు  ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మరియు పెన్షనర్లకు వర్తించవు. ఈ ఉత్తర్వుల స్టూల సారాంశమును అంశముల వారీగా పరిశీలించు కుందాము.

👉1. హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్య సంరక్షణ బాధ్యత :
Employees Healthcare Scheme (EHS) అనే పథకము అమలుచేసే బాధ్యత ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ (AHCT)కుఅప్పగించబడినది. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబడిన స్టీరింగ్ కమిటీకు చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా, ఆర్థిక, ఆరోగ్య వైద్యశాఖ ప్రిన్సివల్ సెక్రటరీలు, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP), ట్రెజరీ శాఖ కమీషనర్ / డైరెక్టర్లు 60% మరియు సాధారణ పరిపాలనాశాఖ గుర్తించిన ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు 40% సభ్యులుగా ఉందురు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (AHCT) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెంబర్ -కన్వీనర్ గా వ్యవహరిస్తూ మొత్తం పథకమును అజమాయిషీ చేస్తారు.

👉2. EHS పథకము లక్ష్యము :

ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు నగదుతో పనిలేని ఆరోగ్య సంరక్షణ కల్పించడము ఈ పథకము లక్ష్యంగా నిర్ణయించబడినది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించియున్నEHS  నెట్వర్క్ లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అల్లోపతి వైద్య సంరక్షణ కొరకు1885 వ్యాధులకు చికిత్సను ఇన్ పేషంటు గా ఇవ్వబడును. ఔట్  పేషంట్ గా  దీర్ఘకాలిక చికిత్స అవసరమగు వ్యాధులను నోటిపై చేసి ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులలోకి అనుమతించబడును. EHS కు అవసరమైన నిధులను 40% ఉద్యోగులు , పెన్షనర్లు చెల్లించే ప్రీమియం ద్వారా మిగిలిన 60% ప్రభుత్వము నుండి సమకూర్చబడును. ప్రస్తుతము అమలులో ఉన్న మెడికల్ అటెండన్స్ రూలు  1972 స్థానములో ఈ పథకము ప్రవేశపెట్టబడినది. ఈ పథకములో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ నిర్బందంగా  చేరాలి మరియు ప్రీమియం రూపేణా చందాలను విధిగా జీతాల బిల్లుల ద్వారా చెల్లించాలి.

👉3. ఈ స్కీం లో  ఎవరు సభ్యులుగా చేరవచ్చు ?

ఈ స్కీం వర్తించు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ EHS లో తప్పనిసరిగా సభ్యులుగాచేరవలెను. భార్య, భర్తలిరుపురు ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ స్కీంలో సభ్యులుగా చేరితే సరిపోవును. అయితే భార్య / భర్త / అత్తమామలకు కూడా ఈ పథకములో వర్తింప చేయాలంటే ఇద్దరూ విడివిడిగా (ఆధారితుల జూబితాలో సారూప్యత ఆధారితులు లేకుండా) సభ్యులుగా చేరాలి.

👉4. ఈ స్కీం  ద్వారా ఆరోగ్య సంరక్షణ ఉద్యోగి కుటుంబ సభ్యులలో ఎవరెవరికి వర్తించును ?

 కుటుంబములో సభ్యులెవరు?

👉ఉద్యోగి / పెన్షనర్ పై జీవనోపాధి కొరకు పూర్తిగా అధారపడిన కన్న తల్లిదండ్రులను గాని లేదా పెంపుడు తల్లిదండ్రులలో ఎవరో ఒక జంటను మాత్రమే అనుమతించబడును.

👉పురుష ఉద్యోగి / సర్వీస్ పెన్షనర్ విషయంలో చట్టబద్డముగా పెళ్ళాడిన ఒక భార్య (ఆ భార్యపై ఆధారపడిన తల్లిదండ్రుల విషయంలో సపరణ ఉత్తర్వులు రావలసియున్నవి).

👉స్త్రీ ఉద్యోగిని / సర్వీస్ పెన్షనర్ అయితే ఆమెపై ఆధారపడిన భర్త (అతని యొక్క తల్లిదండ్రుల విషయములోసవరణ ఉత్తర్వులు రావలసియున్నవి)

👉పూర్తిగా ఆధారపడిన స్వంత పిల్లలు, ఆధారపడిన 25 నం.లలోపు మగపిల్లలందరు, ఆడపిల్లలైతే వయస్సుతో నిమిత్తం లేకుండా వారు నిరుద్యోగులు, అవివాహితులు లేక విధవరాంధ్రు లేక విడాకులు పొందిన లేక భర్తచే వదిలేయబడిన (divorced ) వారు అయివుండాలి. అదే విధంగా 25 సం .ల లోపు మగ పిల్లలు, పైన సూచించ బడిన విధముగా అడపిల్లలు కూడా ఈ పథకములో చేరుటకు అర్హులు.

👉5. చికిత్స కాలమును ఎట్లు పరిగణిస్తారు ?

దీర్ఘకాల వ్యాధులతో నహా అన్ని రకాల వ్యాధులకు ఆసుపత్రిలో రిపోర్టు చేసిన మొదటి తేదీ నుండి ఆసుపత్రి విడిచినతరువాత 10 రోజుల వరకు అగు ఆన్ని రకాల వైద్య ఖర్చులు (మందులు, పరీక్షలు, స్కానింగ్లు, రూమ్ ధార్జీలు మొ. నవి) సంబంధిత వ్యాధి చికిత్స ప్యాకేజీలో చేర్చబడును. అంబులెన్స్లో ఇంటిపద్దకు చేర్చు ఖర్చు కూడా ప్యాకేజీలోఇమిడి యుండును. ఈ పథకం ప్రవేశ పెట్టుటకు పూర్వమే ఉన్న వ్యాధులకు కూడా ఈ పథకంలో చికిత్స కు అనుమతించ బడును. ఒక సం,, వరకు చికిత్స అసంతర సేవలు, మందులు, పరీక్షలు ఉచితముగా నిర్వహించబడును.

👉6. వైద్యఖర్చు పరిమితి :

ఒక కుటుంబంలోని సభ్యులందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చికిత్సకు (per every episode of illness) గరిష్టంగా రూ.2లక్షల వరకు అగు ఖర్చును హెల్త్ కార్డు ద్వారా అనుమతించబడును. ఈ పథకములో రూ.175 కోట్ల రూపాయలు Buffer Amount (ముందున్న మొత్తము)గా ప్రభుత్వ వాటా ఉంచబడినది. రోగ తీవ్రతను బట్టి వ్యక్తికి రూ.2 లక్షలకు మించి కూడా నగదు రహిత చికిత్స కొనసాగించుటకు ఈ పథకము అమలు పరచు ఏ అసుపత్రి కూడా నిరాకరించకూడదు.

👉7. హెల్త్ కార్డులు ఎట్లు జారీ చేస్తారు ?

ఉద్యోగులు, పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్లు అందరినీ ఈ పథకములో విధిగా చేర్చి హెల్త్ కార్డులు అందజేయుటకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మరియు అకౌంట్స్ (IDTA) వారికి, అరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ వారికి ఈ ఉత్తర్వులలో సూచనలు ఇవ్వబడినవి.

👉ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ  హెల్త్ కేర్  ట్రస్ట్ నిర్వహించబడే వెబ్సైట్లోని E RMS - E.S ద్వారాఆన్లైన్లో దరఖాస్తులను e -form ద్వారా / మీ సేవ కేంద్రముల ద్వారా లేక స్వంత ఇంటర్నెట్ ద్వారా తేది 1-11-2003 నుండి 30 రోజులలో సమర్పించవలెను. ట్రెజరీ వారు ఇచ్చిన 7 అంకెల జీతాల ఐ .డి. నెంబర్ను యూజర్ ఐ.డి.గా, పాస్ వర్డ్  ఉపయోగించుకొని లాగిన్ అవ్వవచ్చును. 104కు ఫోన్ చేసి అవసరమైన సమాచారము పొందవచ్చును. ఆ తదుపరి పాస్ వర్డ్ ను మార్చుకొని దానినే ఇకపై ఉపయోగించుకోవాలి. అవసరమై నప్పుడే పాస్ వర్డ్ ను మార్చుకొనవచ్చును. ఈ దరఖాస్తుతో పాటు తన మరియు కుటుంబ సభ్యులందరి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ / ఎన్రోల్మెంట్ నెంబరు, డిజిటల్ పాస్వర్డ్, ఫోటోలను (1CAO Compliant) ఉద్యోగి సేవా పుస్తకము లోని పేరు, పుట్టినతేది, అఫీస్ హెడ్ సంతకము ఉన్న పేజీలు (1 మరియు 2 లేక 4, 5 పేజీలు) స్కాన్ చేసి ఇమేజ్‌ను సమర్పించవలెను. పంపిన తరువాత అప్లికేషన్ నెంబరును పొందవచ్చును. e-form ఫ్రింట్అవుట్ నకలుపై సదరు ఉద్యోగి / పెన్షనర్ సంతకము చేసి దానిని కూడా స్కాన్ చేసి e-form జతపరచి ఆన్లైన్లోపంపవలెను. తప్పుడు సమాచారము ఇచ్చినవారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకొనబడును.

👉ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ  హెల్త్ కేర్  ట్రస్ట్ నిర్వహించబడే వెబ్సైట్లోని ERMS - ES ఉద్యోగులైతే e-form ను డ్రాయింగ్  ఆఫీసర్ కు, పెన్షనర్స్ లేక ఫ్యామిలీ పెన్షనర్ అయినచో EHS కు పంపవలెను..

👉DDO/STO/APPO లు e- form లో వారి దరఖాస్తులోని సమాచారము Validate చేసి అప్లికేషన్ను రిజిష్టర్ చేస్తారు. చిన్న చిన్న తప్పులుంటే వారే సవరణ చేయవచ్చును. సమాచారములోని పెద్ద పెద్ద పొరపాట్లు లేక తేడాలుంటే ఉద్యోగి / పెన్షనర్ కు సవరణల కొరకు త్రిప్పి పంపవచ్చును. DDO/ STO / APPO లు దరఖాస్తు ఆన్లైన్లో accept / reject చేసిన విషయమును SMS ద్వారా ఉద్యోగి / పెన్షనర్కు తెలియజేయబడును.

👉DDO/ STO / APPO లు కంప్యూటర్ పరిజ్ఞానము లేని ఉద్యోగుల / పెన్షనర్ల దరఖాస్తులను వారే స్వయంగా సదరు ఉద్యోగి / పెన్షనర్ సహకారముతో అన్లైన్లో పంపవచ్చును.

👉ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (AHCT) వారికి ప్రతి ఉద్యోగి / పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్ ఈ పథక లబ్దిదారులందరి పేర్లు, వివరములు, ఫోటోలు కలిగియుండు తాత్కాలిక కార్డును వెబ్సైట్ ద్వారా జారీ చేయు అధికారము ఇవ్వబడినది. ఈ కార్డులో ఉన్న లబ్దిదారులకు మాత్రమే ఈ పథక ప్రయోజనములు వర్తించును. శాశ్వత ఆరోగ్య కార్డులు Card Issue Centers (CIC) ద్వారా ఇవ్వబడును. కుటుంబ సభ్యులందరు తమ వేలిముద్రలను CIC లలో Acknowledgement లాగ ఇచ్చి శాశ్వత కార్యడులు 90 రోజులలో పొందవచ్చును.  శాశ్వత ఆరోగ్య కార్డులు పొందువరకు తాత్కాలిక ఆరోగ్య కార్డులతో నగదురహిత చికిత్స పొందవచ్చును. ఈ పథకము డిసెంబర్ 5 నుండి ప్రారంభించబడును. తాత్కాలిక ఆరోగ్యకార్డులు పొందువరకు లేక ప్రభుత్వము వారు నిర్ణయించిన తేది వరకు అవసరమైన వైద్య చికిత్సలను ప్రస్తుతము అమలులో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానము ద్వారా పొందవచ్చును.

0 comments:

Post a Comment