Wednesday, June 3, 2020

AP TEACHERS TRANSFERS 2020 DETAILS


ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

❖ పారదర్శకంగా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశం

❖ పదో తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశం

❖ బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశం

❖ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఆదేశం.

❖ గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

❖ విద్యాశాఖ  సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్




🔹ఉపాధ్యా యుల బదిలీలకు మార్గం సుగమం అ యింది. బుధవారం ముఖ్యమంత్రి నిర్వహిం చిన విద్యాశాఖ సమీక్షలో అందుకు గ్రీన్‌సిగ్నల్‌ ల భించింది. గతానికి భిన్నంగా సమూల మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే బ్లూప్రింట్‌ సిద్ధ చేశా రు. పదో తరగతి పరీక్షలు ముగిసిన అనంతరం జూలై 15 తర్వా త ప్రక్రియ ప్రారంభంకానుంది. ముందుగా రేషనలైజేషన్‌ చేపట్టి, అనంతరం బదిలీలు నిర్వహించనున్నారు. 2017 తర్వాత టీచర్ల బదిలీ లు జరగలేదు. దీంతో అనేక మంది అతృతగా ఎదురు చూస్తున్నారు.


🔸రేషనలైజేషన్‌లో మూడు, నాలుగు కేటగిరీలపై దృష్టి

బదిలీలకు ముందు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషన లైజేష న్‌) చేపడతారు. అంటే పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొంటారు. పిల్లలు తక్కు వ ఉన్న చోట్ల ఎక్కువగా ఉన్న టీచర్లను అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏటా ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. ప్రధానంగా మూడు, నాల్గో కేటగిరీ  ప్రాంతాల్లోని పాఠశాలలపై దృష్టి కేంద్రీకరించి ఈ ప్రక్రియను నిర్వహిస్తారు.

🔹బదిలీల్లో సమూల మార్పులు

ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం సమూల మార్పులు చేస్తోంది. బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు దీనికోసం దరఖాస్తులు కూడా అధికారులు రూపొందించారు. పాయింట్ల కేటాయింపు, బదిలీల సీని యారిటీలో వచ్చే అభ్యంతరాలను కూడా అన్‌లైన్‌లోనే పరిష్కరిస్తారు. ఈసారి సీనియారిటీ, స్టేషన్‌ పాయింట్ల ఆఽధారంగానే బదిలీలు నిర్వ హించనున్నారు. ఒకే స్థానంలో ఐదు సంవత్సరాలు పూర్తిచేసిన ప్రధా నోపాధ్యాయులు, ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన సెకండరీగ్రేడ్‌ టీచర్లు, స్కూలు అసిస్టెంట్ల స్థానాలను ఖాళీలుగా ప్రకటించనున్నారు.

🔸వ్యక్తిగత  సామర్థ్యాలకు చెక్‌

🔹టీచర్ల బదిలీల్లో వ్యక్తిగత సామర్థ్యాలకు పాయింట్లు కేటాయింపునకు చెక్‌ పెట్టారు. 2017లో జరిగిన బదిలీల్లో పదుల సంఖ్యలో ఇచ్చిన సవ రణలు వ్యక్తిగత సమర్థ్యాలకు కేటాయించిన పాయింట్లతో బదిలీల ప్రక్రియ రహస్యంగా మొదలైంది. రాష్ట్ర, జాతీయ  స్థాయిలో క్రీడలు, ఆటల పోటీలు, సైన్సు ఫెయిర్‌లో పాల్గొని బహుమతులు సాధించిన వారు, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టులో సాధించిన ఉత్తీర్ణత ప్రతి భ అవార్డులు, పాఠశాలలకు విరాళాలు తదితర అంశాలకు ఈసారి బదిలీల్లో పాయింట్ల కేటాయింపు ఉండదు. ప్రిఫరెన్షియ ల్‌ కేటగిరీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

0 comments:

Post a Comment