Friday, June 12, 2020

AP INTER RESULTS 2020

ఇంటర్‌ ఫలితాలు  విడుదల

 🎯 గమనిక :

 🎯  ఈ  క్రింద   వెబ్సైటు  సర్వర్స్ కలవు మొదటిది  బిజీ గా  ఉంటె క్రిందివి   క్లిక్  చేయండి  



Keep your Hall-Ticket No. and Date of Birth ready for Viewing of Results

CHECK  YOUR RESULTS
FIRST SERVER FOR RESULTS




SECOND SERVER FOR RESULTS  

AP Intermediate First year (General) Results 2020


ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.

ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో అందరికన్నా ముందుగా ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా మంత్రి సురేశ్‌ అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మార్గదర్శకాల మేరకు సమష్టిగా కృషి చేసి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల అన్నీ ఆలస్యం అవుతున్నా.. అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను విడదల చేసిందని మంత్రి వెల్లడించారు.

బాలికలదే పైచేయి..

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,07,230 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,00,560 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత 59 శాతంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. మొదటి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం బాలికల్లో 64 శాతం కాగా.. బాలురులో 55 శాతంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే 4,35,655 మంది విద్యార్థులు రెండో ఏడాది పరీక్షలకు హాజరుకాగా 2,76,389 మంది పాస్‌ అయ్యారన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. వారిలో బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 60 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.

ఫలితాల్లో జిల్లాల వారీగా స్థానాలు...
ఇంటర్‌ మొదటి సంవత్సరం

మొదటి స్థానం: కృష్ణా జిల్లా (75 శాతం)

రెండో స్థానం: పశ్చిమ గోదావరి, గుంటూరు (65 శాతం)

మూడో స్థానం: విశాఖపట్నం (63 శాతం)

ఇంటర్‌ రెండో సంవత్సరం

మొదటి స్థానం: కృష్ణా జిల్లా

రెండో స్థానం: పశ్చిమ గోదావరి (71 శాతం)

మూడో స్థానం: నెల్లూరు, విశాఖపట్నం (68 శాతం)

💧ఇంటర్ ఫలితాలు - వెబ్ సైట్లు

1) https://bie.ap.gov.in

2)www.sakshieducation.com

3) www.andhrajyothy.com

4) www.vidyavision.com

5) http://examresults.ap.nic.in

6) www.exametc.com

7) https://telugu.news18.com

8) http://results.prajasakti.com

9) www.indiaresults.com

10) https://results.bie ap.gov.in

11) results.eenadu.net

12)www.manabadi.com

13)www.schools9.com

14) www.jagranjosh.com

14) www.visalaandhra.com

15)www.Results.shiksha

16) www.examresults.net

2 comments: