జులై 11 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
🔸ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ విద్యా మండలి
విడుదల చేసింది. జులై 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం
2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనున్నాయి.
🔹ప్రాక్టీకల్ పరీక్షలు 1 నుంచి 4 వరకు రెండు విడతల్లో ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.
🔹నైతికత, మానవీయ విలువలు 5న, పర్యావరణ విద్య పరీక్ష 6న ఉదయం 10గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.
🔸పరీక్ష రుసుము చెల్లింపునకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు.
🔹మరోవైపు ఇంటరు మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు
విడుదలకాని విద్యార్థుల వివరాలను పంపించాలని ప్రిన్సిపాళ్లకు ఇంటర్ విద్యామండలి
సూచించింది.
0 comments:
Post a Comment