WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

FACEBOOK DATA PORTABILITY

FACEBOOK DATA  PORTABILITY

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన సర్వర్‌లో సేవ్‌ చేసిన డేటాను గూగుల్‌ ఫోటోస్‌వంటి మిగతా ప్లాట్‌ఫామ్‌లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. డేటా పోర్టబులిటీ ఫీచర్‌ను అమెరికా, కెనడాలోని ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. అమెరికా, కెనడా వినియోగదారులు గురువారం నుండి వారి ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవొచ్చు. ఇప్పటికే యూరప్, లాటిన్ అమెరికాతో సహా పలు దేశాలలో ఈ ఫీచర్‌ ప్రారంభించారు. వినియోగదారుల డేటా విషయంలో కొత్త సర్వీస్‌ ప్రొవైడర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును వారికి కల్పించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నాయని ఫేస్‌బుక్‌లో ప్రైవసీ అండ్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ స్టీవ్‌ సాట్టర్‌ఫీల్డ్‌ తెలిపారు. డేటా పోర్టబులిటీతో వినియోగదారులకు తమ డేటాపై మరింత నియంత్రణ ఉండే వెసులు బాటు ఉంటుందన్నారు.

ఈ నిర్ణయంతో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫోటోలు, వీడియోలను వినియోగదారుడు కావాలనుకుంటే నేరుగా గూగుల్‌ డ్రైవ్‌వంటి మరో సర్వీస్‌ ప్రొవైడర్‌ సర్వర్‌లో అప్‌లోడ్‌ చేసుకునేలా అవకాశం ఉంటుంది. ఒక వేళ ఫేస్‌బుక్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్‌ అయినా లేదా ఖాతానే డిలీట్‌ అయినా డేటా మాత్రం గూగుల్‌ డ్రైవ్‌లో సురక్షితంగా ఉండనుంది.

-----SAKSHI NEWS