Sunday, May 3, 2020

AP COVID19 MIGRANT REGISTRATION FORM

AP  PEOPLE STUCK UP OTHER STATES  SHOULD REGISTER SPANDANA WEBSITE

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారంతా స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోవిడ్ స్టేట్ లెవల్ కో ఆర్డినేటర్ కృష్ణబాబు తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లంతా spandana.ap.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సమాచారం ఇచ్చామని.. ఏపీకి రావాలనుకుంటున్నవారికి ఏర్పాట్లు చేయాలని కోరామని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం https://www.spandana.ap.gov.in/ అనే వెబ్ సైట్‌ను నిర్వహిస్తుంది.

ఆ వెబ్ సైట్‌లోకి వెళ్లిన తర్వాత Covid-19 Movement of People అని కొత్త ఆప్షన్ ఉటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది.


MIGRANT REGISTRATION FORM DIRECT LINK

అందులో మీ వివరాలు నమోదు చేయాలి.


ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారా?,

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారో తెలియజేయాలి.


మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్, వయసు తెలియజేయాలి.


ఆ తర్వాత ఏపీలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నమోదు చేయాలి.

మీ జిల్లా, మండలం, ఊరు,

అది రెడ్ జోన్‌లో ఉందా? అనే వివరాలు అందించాలి.

ఆ తర్వాత మీరు ఎందుకు ప్రయాణించాలనుకుంటున్నారో తెలపాలి.

మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే వివరాలు కూడా అందించాలి.

మీరు ఒక్కరే కాకుండా, ఓ పది, 15 మంది వరకు ఉన్నట్టయితే, ఆ వివరాలు తెలియజేయాలి.


మీరు వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వారిని ఏ రకంగా రాష్ట్రానికి తీసుకుని రావాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.

ఇతర రాష్ట్రాల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు కూడా తెలుస్తాయి.


మీరు రాష్ట్రంలో ప్రభుత్వంతో ఏపీ సర్కారు మాట్లాడి మీరు ఉన్న దగ్గరికే బస్సులు పంపిస్తారు.

మిమ్మల్ని రైల్వే స్టేషన్‌ వరకు తీసుకొచ్చి అక్కడ నేరుగా ట్రైన్ ఎక్కిస్తారు.

0 comments:

Post a Comment