WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

FOUR PERCENT ( 4 % ) RESERVATION IN APPOINTMENT AND IN PROMOTIONS FOR BENCHMARK DISABILITIES

FOUR PERCENT ( 4 % ) RESERVATION IN APPOINTMENT AND IN PROMOTIONS IN EVERY GOVERNMENT ESTABLISHMENT IN FAVOUR OF BENCHMARK DISABILITIES

ఉద్యోగాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజర్వేషన్లు... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు...

 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలతో పాటు ప్రమోషన్లలో కూడా వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల శాఖ పేరుతో ఈ నెల 19వ తేదీతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘ప్రభుత్వం సంస్థల్లో సర్కారు ఇచ్చే ప్రతి అపాయింట్‌మెంట్‌లోనూ తప్పనిసరిగా 4 శాతానికి మించకుండా దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలి. బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వారికి 1 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన అర్హతలతో ఏ ఉద్యోగి అయినా లభించకపోతే ఆ తర్వాత సంవత్సరానికి ఆ ఖాళీలను వాయిదా వేయాలి. అంతేకానీ, ‘దొరకడం లేదు.’ అనే కారణంతో దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్లలో మరొకరిని భర్తీ చేయకూడదు.’ అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ మహిళా దివ్యాంగురాలికి ఉద్యోగం రిజర్వ్ అయి ఉంటే, ఒకవేళ అర్హులైన మహిళా దివ్యాంగురాలు లభించకపోతే పురుష దివ్యాంగుడిని ఆ ఉద్యోగంలో భర్తీ చేయవచ్చు.



ఒకవేళ దివ్యాంగులు పనిచేయలేని ఏదైనా ప్రభుత్వ శాఖ ఉంటే, సంబంధిత డిపార్ట్‌మెంట్ ఆ కారణాన్ని స్పష్టంగా పేర్కొని రిజర్వేషన్లను మినహాయించవచ్చు. పూర్తిగా అయిన మినహాయించవచ్చు. లేదా పాక్షికంగా అయినా మినహాయించవచ్చు. కానీ, ఆ మినహాయింపు అనేది ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ అంతిమ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఆ కమిటీకి మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ / ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ డైరెక్టర్ సభ్యుడు (కన్వీనర్ కూడా)గా ఉంటారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (మెంబర్), పబ్లిక్ "&" కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ (మెంబర్), మరొకరు సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి 1996 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌లో సవరణలు తీసుకురానున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో వికలాంగుల రిజర్వేషన్లు 2011 నుంచి ఉన్నాయి. 2016లో కేంద్రం 4 శాతం పెంచింది. దాని ఆధారంగా రాష్ట్రం కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

DOWNLOAD COPY CLICK HERE