WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

MDM COOKING CHARGES

మధ్యాహ్న భోజన పథకం చార్జీల పెంపు

 మధ్యాహ్న భోజన పథకం, ఆహార పదార్థాల నాణ్యతను పెంచే క్రమంలో ఈనెల 21 నుంచి నూతన మెనూ (ఆహార పట్టిక)ను అమలు చేయనున్న నేపథ్యంలో వంట ఖర్చులు (కుకింగ్‌ చార్జీలు) పెరగనున్నాయి. నూతన మెనూలో ప్రతీ విద్యార్థికి చిక్కీ (వేరుశెనగ ఉండ)ని ఇవ్వా లని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఒక్కో చిక్కీ తయారీకి రూ.1.69 పైసలుగా నిర్ధారించారు. ఆ ప్రకారం చిక్కీతో కలిపి మధ్యాహ్నభోజన పథకం కింద ఒక్కో హైస్కూలు విద్యార్థికి ఇకమీదట రూ.8.80 పైసల చొప్పున కుకింగ్‌ చార్జీలుగా వెచ్చిస్తారు. ప్రైమరీ స్కూలు విద్యార్థికి రూ.6.60 పైసలుగా నిర్ధారించారు. ఈ ధరలు పాత మెనూ ప్రకారం (చిక్కీ లేకుండా) హైస్కూలుకు రూ.6.71 పైసలు, ప్రైమరీ స్కూలుకు రూ.4.48 పైసలుగా ఉండేది. చిక్కీ లేకుండా కుకింగ్‌ చార్జీలను పాత ధరల కంటే హైస్కూలు విద్యార్థులకు అయితే రూ.40 పైసలు చొప్పున, ప్రైమరీ స్కూలు విద్యార్థులకు అయితే 43 పైసలు చొప్పున పెరుగుదల ఉంటుంది. ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో చిక్కీ ఇస్తారు. ఒక్కో చిక్కీ బరువు 25 గ్రాములుగా నిర్ధారించారు.

చిక్కీ తయారీపై మధ్యాహ్నభోజన పథకం వంట ఏజన్సీలతో శుక్రవారం రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకు న్నారు. చిక్కీల తయారీకి చాలా సమయం పడుతుందని భోజన పథకం ఏజన్సీలు ఆసక్తిని చూపకపోవడంతో టెండర్లను ఆహ్వానిం చడం ద్వారా డివిజన్ల వారీగా పంపిణీదారులను ఎంపిక చేసి అప్పగించే అవకాశం ఉంది. అయితే టెండర్ల ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడం, ఈనెల 21 నుంచే నూతన మెనూను అమలు చేయాల్సి రావడం నేపథ్యంలో కనీసం ఒక నెల రోజులపాటైన భోజన పథకం ఏజన్సీలు చిక్కీల పంపిణీ బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మొత్తం 2.30 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. కుకింగ్‌ చార్జీల పెంపుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.