SSC MARCH,2020 నామినల్ రోల్స్ కు సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు:
1.మొదట ssc march 2020 నామినల్ రోల్స్ యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పూర్తిగా చదవండి. తరువాత మాత్రమే అప్డేట్ చేయండి.
2. ప్రతి విద్యార్థికి సంబంధించి సమాచారమును ఎడిట్ చేసి ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత మాత్రమే కంఫర్మ్ చేయండి.
2. ఒకసారి కన్ఫామ్ చేసిన తర్వాత తప్పులను గుర్తించినట్లయితే దానిని కరెక్ట్ చేయడానికి డివైఇఓ, డిఈఓ లాగిన్ లలో అవకాశం లేదు. DGE గారికి మాత్రమే ఉంటుంది. కావున కన్ఫామ్ చేయడానికి తొందరపడకండి.
3. ఫోటో మరియు సంతకం క్లారిటీ కోసం DGE గారు కోరినట్టు 40kb నుండి50kb వరకు ఫోటోను, 15kb నుండి 20kb వరకు సంతకాన్ని కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి. ఇదివరకే చేసి ఉన్నప్పటికీ తిరిగి పైన తెలిపిన సైజులలో కంప్రెస్ చేసి అప్లోడ్ చేయండి.
4. ప్రైవేట్ యాజమాన్యాలు సెక్షన్ వారీగా గుర్తింపు ఆర్డర్ను అప్లోడ్ చేసిన తర్వాతనే పదవతరగతి నామినల్ రోల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విషయాన్ని గమనించాలి.
5. ఎడిట్ చేసిన నామినల్ రోల్స్ ను ఇండివిడ్యువల్ కాపీలను ఒకసారి ప్రింట్ తీసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే కన్ఫాం చేయండి.
6. కన్ఫామ్ చేసిన తరువాతనే ఫీజ్ పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆన్లైన్ ద్వారా ఫీజు కట్టాలి. ఇదివరకే కట్టేసి ఉన్నట్లయితే వారి గురించి డిజిఇ గారికి తెలియ జేయడం జరిగింది. వారి నుండి సూచనలు వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇది
7. పుట్టిన తేదీ ఎంటర్ చేయగానే అండర్ ఏజ్ అయితే ఆటోమేటిక్ గా కాండొనేషన్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు లేదా డీఈవో ప్రొసీడింగ్స్ విద్యార్థి అభ్యర్ధన పత్రం డాక్టర్ సర్టిఫికేట్ మరియు 300 రూపాయల కాండొనేషన్ చలానా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
8. వికలాంగులుగా చూపిస్తే ఆటోమేటిక్ గా వికలాంగుల సర్టిఫికెట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది.
9. చివర్లో ఫీజు exemption ఎంతమంది అనేది ఫీడ్ చేయగానే ఫీజ్ కట్టవలసిన వారికి ఎంత కట్టాలి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది.
10. 2017,2018,2019 సంవత్సరాలలో once failed candidates కు పరీక్ష ఫీజు కట్టడానికి నామినల్ రోల్స్ కోసం ప్రత్యేక లింకు ఇవ్వబడుతుంది. వాటిని రెగ్యులర్ లింకులో నింపలేమని గమనించగలరు.
0 comments:
Post a Comment