Sunday, December 29, 2019

JL PROMOTIONS AMENDMENT DRAFT RULES

JL PROMOTIONS AMENDMENT DRAFT RULES

పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం త్వరలో శుభవార్త వినిపించనుంది. చానాళ్లుగా వారు చేస్తున్న డిమాండ్‌ మేరకు వారికి జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల్లో 90 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, 10 శాతం బోధనేతర ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నిబంధనలను సవరించి ఇకపై డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 50 శాతం, బోధనేతర ఉద్యోగులకు 10 శాతం ఇచ్చి.. మిగిలిన 40 శాతం పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారిని దీనికి అర్హులుగా గుర్తించనున్నారు. పురపాలక శాఖ త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తుందని సమాచారం. కాగాPRO
. ప్రస్తుతం 500 మందికిపైగా విద్యార్థులున్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను జూనియర్‌ కళాశాలగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎంటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామకృష్ణ తెలిపారు. ‘నాడు- నేడు’ కింద పాఠశాలలకు ఇచ్చిన మార్గదర్శకాల్లో ఇలాంటి బడుల్లో జూనియర్‌ కళాశాల ఏర్పాటు కోసం తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించనున్నాయని ఆయన వెల్లడించారు.

DOWNLOAD JL PROMOTIONS AMENDMENT DRAFT  COPY

0 comments:

Post a Comment