WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

WHATS APP FINGER PRINT LOCK


WHATS APP FINGER PRINT LOCK -NEW FEATURE 
వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్.. వచ్చేసింది!
  
🔸వాట్సాప్ వినియోగదారులు ఎప్పట్నుంచో ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్ కావాలని కోరుతున్నారు. ఈ ఫీచర్ ఇప్పటికే ఐవోఎస్ వినియోగదారులకు ఎప్పుడో అందుబాటులోకి రాగా.. ఆండ్రాయిడ్ వినియోగదారులకు తాజాగా అందుబాటులోకి వచ్చింది.

దీన్ని యాక్టివేట్ చేయడానికి కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి..

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

అందులో అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.

అక్కడ ప్రైవసీలోకి వెళ్లండి. అక్కడ అన్నిటి కంటే కింద మీకు ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది.

దానిపై ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి.

మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చాక, మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నే వాట్సాప్ అన్ లాక్ చేయడానికి కూడా ఉపయోగించమంటారా? అని అడుగుతుంది. అప్పుడు మీరు దాన్ని కన్ ఫర్మ్ చేస్తే చాలు.


 🔹ఆ ఆప్షన్ కింద మీకు ఒక టైమర్ కనిపిస్తుంది. అక్కడ మీరు వెంటనే లాక్ చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఒక నిమిషానికి లాక్ చేయాలనుకుంటున్నారా? 30 నిమిషాల అనంతరం లాక్ చేయాలనుకుంటున్నారా? అని అడుగుతుంది. అక్కడ మీకు నచ్చిన సమయాన్ని ఇవ్వవచ్చు

🔸దాని కిందనే మీకు ‘Show content in Notifications’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. సాధారణంగా మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు వారి పేరు, వారు పంపిన మెసేజ్ లో మొదటి రెండు లైన్ల వరకు మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే ఆ మెసేజ్ మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపించదు. కాబట్టి వెంటనే దీన్ని కూడా ఎనేబుల్ చేస్తే మంచిది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోఎస్ కు ఈ ఫీచర్ ను అందించలేదు. కానీ ఐవోఎస్ వినియోగదారులు ఈ ఫీచర్ కావాలనుకుంటే వారి ఫోన్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్స్ కు వెళ్లి అందులో ఎంచుకోవచ్చు.