Wednesday, August 14, 2019

WHATS APP NEW SECURITY FEATURE

WHATS APP NEW SECURITY FEATURE/FINGER PRINT AUTHENTICATION FEATURE


ప్రముఖ మెసేంజర్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా...లేదా వాడకుండా  ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది.

యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా..టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్‌ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది.

HOW TO ACTIVE  FINGER PRINT AUTHENTICATION FEATURE


ఈ ఫీచర్ ఎలా ఆక్టివేట్‌ చేయాలంటే..

ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయాలి.
ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
యూస్‌ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్‌ అప్షన్‌పై ప్రెస్ చేయాలి

0 comments:

Post a Comment