Wednesday, August 14, 2019

MUNICIPAL TEACHERS PROMOTIONS AND ENGAGEMENT OF PART TIME INSTRUCTORS

MUNICIPAL TEACHERS PROMOTIONS AND ENGAGEMENT OF PART TIME INSTRUCTORS (LR ROC NO.3276/2017–J3, DT 13/8/2019)


పురపాలక శాఖ పదోన్నతులు షెడ్యూల్ విడుదల-(Lr Rc No.3276/2017–J3, dt 13/8/2019)

గత ఫిబ్రవరి 2019 నెలలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు పదోన్నతుల ప్రక్రియ తదుపరి మిగిలి ఉన్న ఖాళీలకు షెడ్యూలు   ఫిబ్రవరి 2019 తదుపరి వచ్చిన అన్ని ఖాళీలను  పదోన్నతులు తో  భర్తీ చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

ఈ పదోన్నతులు అన్ని అమలులో ఉన్న సర్వీస్ రూల్స్ మేరకు రాబోవు కోర్టు తీర్పులకు లోబడి ఉంటాయి.

షెడ్యూల్:

* కంబైన్డ్ సీనియారిటీ జాబితాల ప్రచురణ అభ్యంతరాలకు ఆహ్వానం: ఆగస్ట్ 16 నుండి  22 వరకు

* అభ్యంతరాల పరిష్కారం:  24.8.2019

* ఖాళీ లకు ప్యానల్ జాబితాల తయారీ, ప్యానెల్ కమిటీ సమావేశం: ఆగస్ట్ 26 AND 27

* పదోన్నతులు కౌన్సిలింగ్:  ఆగస్ట్ 28 నుండి 31 వరకు

* పదోన్నతి ఉత్తర్వుల జారీ: కౌన్సిలింగ్ జరిగిన చివరి తేదీ ఏదైతే అది.

Note:

గతం లో నిర్వహించిన విధంగా అప్గ్రేడెడ్ లాంగ్వేజ్ పండిట్ పోస్ట్ లకు మాత్రమే భాషా పండితులకు పదోన్నతులు ఇస్తున్నారు. పదవీ విరమణ /డెత్ కారణాల వల్ల ఏర్పడిన S.A Languages ఖాళీలను భర్తీ చేయడం లేదు.



రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా మున్సిపల్ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థులకు ప్రవేశాలు పెరిగాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు, కలెక్టర్లు, కమిషనర్లు విద్యా వాలంటీర్ల నియామకం చేయాలని కోరారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గత జూలైలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ భారీగా పెరిగిన విద్యార్థుల నమోదు తో సరిపడా ఉపాధ్యాయులు లేరు.
మొత్తంగా మున్సిపల్ స్కూల్స్ లో 1418 స్కూల్ అసిస్టెంట్లు, 487 ఎస్జిటి ల అవసరం ఉంది.
ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి గాను అవసరమైన విద్యా వాలంటీర్లను రెండు దశలలో నియమిస్తారు.

 మొదటి దశ
ఆగస్టు 14 నుండి 16  జిఓ 210 ప్రకారం అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య లెక్కిస్తారు. పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయుల సంఖ్య తీసివేసి న తదుపరి అవసరమైన వాలంటీర్లను నియమిస్తారు. ఈ వాలంటీర్లు అందరూ DSC 2018 ఉపాధ్యాయులు జాయిన్ అయ్యేవరకు విధులు నిర్వహిస్తారు.
రెండవ దశ సెప్టెంబర్ 1 నుండి 3:
డీఎస్సీ 2018 ఉపాధ్యాయులు చేరడం ఆలస్యమైనా, పదోన్నతి ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయినా, నూతన పాఠశాల ఏర్పాటు వలన వాలంటీర్లు అవసరమైనా అవసరమైన ప్రతిపాదనను ఆర్.డి. ల కు పంపాలి.

ప్రతి ఉన్నత పాఠశాల హెచ్ఎం,  వాలంటీర్లకు సంబంధించి
Need Assessment Report  సంబంధిత కమిషనర్ కు అందజేయాలి. నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా కమిషనర్ వాటిని పరిశీలిస్తారు.
నియామకమైన వాలంటీర్లు అందరకు నెలకు రూ. 8000/– గౌరవ వేతనం ఇస్తారు.
సూచనలు:
1) వాలంటీరు పోస్టుకు సంబంధించిన అర్హతలు తప్పక కలిగి ఉండాలి
2) ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి
3) నియామక ప్రక్రియ మొత్తం సంబంధిత కమిషనర్, MEPMA ప్రతినిధి, హెచ్ఎం, హై స్కూల్ లో ఒక సీనియర్ టీచర్ నిర్వహిస్తారు.
4) నియామక ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో నిర్వహించాలి
5) డీఎస్సీ 2018 ఉపాధ్యాయులు చేరిన వెంటనే వాలంటీర్ల విధులు ముగించాలి.
6) వీరి గౌరవ వేతనాన్ని మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి చెల్లిస్తారు
DOWNLOAD FULL DETAILED COPY




0 comments:

Post a Comment