Thursday, August 22, 2019

EARNED LEAVE AND SURRENDER OF EARNED LEAVE BRIEF NOTE

EARNED LEAVE AND SURRENDER OF  EARNED LEAVE  BRIEF NOTE
ఆర్జిత సెలవు సరెండర్ ముఖ్యాంశాలు.


ఉద్యోగి ఖాతాలో  ఆర్జిత సెలవుల సంఖ్య 300  దాట వచ్చా ?
ఎప్పుడు 12/24 నెలల విరామం తో సంబంధం లేకుండా సరెండర్ చేయ వచ్చా?

వెకేషన్ డిపార్ట్మెంట్ అయిన విద్యా శాఖ లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సాధారణ పరిస్థితుల్లో సంవత్సరానికి 6 ఆర్జిత సెలవులు జమ చేయబడతాయి. ఇందులో జనవరి 1 న 3 మరియు జులై 1 న 3 అడ్వాన్స్ గా క్రెడిట్ చేయబడతాయి.

అయితే సరెండర్ చేయదల్చుకున్న ఉద్యోగి ఖాతాలో అడ్వాన్స్ క్రెడిట్ తో కలిపి 15 లేదా 30 రోజులు భర్తీ చేసి సరెండర్ చేయరాదు. అడ్వాన్స్ క్రెడిట్ కన్నా ముందే సదరు ఉపాధ్యాయుల ఖాతాలో 15 లేదా 30 ఆర్జిత సెలవులు నిల్వ ఉండాలి.

వేసవి సెలవుల్లో వివిధ రకాల ప్రభుత్వ విధులు నిర్వర్తించిన సందర్భంలో సదరు ఉద్యోగి ఖాతాలో దామాషా ప్రకారం ఆర్జిత సెలవులు జమ చేయబడతాయి. సాధారణంగా 15 రోజులు ఆర్జిత సెలవులు సరెండర్ చేయడానికి 12 నెలలు, 30 రోజులు సరెండర్ చేయడానికి 24 నెలలు విరామం ఉండాలి.


ఉద్యోగి ఖాతాలో ఉన్న ఆర్జిత సెలవుల సంఖ్య 300 దాట రాదు. అంతకు మించిన ఆర్జిత సెలవులు రౌండ్ ఆఫ్ చేయబడతాయి. (అంటే మురిగిపోతాయి.)

ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుని ఖాతాలో 290 ఆర్జిత సెలవులు ఉంటే ఆ సంవత్సరం వేసవి విధులతో కలిపి వారికి 22 ఆర్జిత సెలవులు వస్తే 290 కు 22 కలిపి 312 సెలవులు ఖాతాలో జమ చేసి 300 కు రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది.

ఉద్యోగి ఖాతాలో జూన్ 30/ డిసెంబర్ 31 వ తేదీ నాటికి ఆర్జిత సెలవుల నిల్వ 285 దాటినట్లయితే 12/24 నెలల విరామం తో సంబంధం లేకుండా సరెండర్ చేయవచ్చు.

అంటే ఉద్యోగి నవంబర్ 2018 లో 15 రోజులు సరెండర్ చేసి ఉంది వారి ఖాతాలో 2019 జూన్ 30/ డిసెంబర్ 31 నాటికి 287 ఆర్జిత సెలవులు నిల్వ ఉన్నట్లయితే 12 నెలలు కాకపోయినా 15 రోజులు జులై/ జనవరి నెలలోనే సరెండర్ చేయవచ్చు. సరెండర్ చేసిన తర్వాత జులై 1/ జనవరి 1 న వేయాల్సిన అడ్వాన్స్ క్రెడిట్, మరియు వేసవి విధులకు సంబంధించిన క్రెడిట్ జమ చేసినచో ఉద్యోగి నష్టపోకుండా ఉంటారు.


ఇందులో కొందరు అమాయకంగా సరెండర్ చేస్తే అనవసరంగా 30 శాతం ఇన్ కం టాక్స్ పోతుందని సరెండర్ చేయడం లేదని చెప్పడం కూడా జరిగింది. 30 శాతం పన్నుకు భయపడి మిగిలిన 70 శాతం మురగ పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. సరెండర్ చేయడం వల్ల మురిగి పోయే సెలవులు నగదుగా మారతాయి అందులో 30 శాతం పన్ను పోతే మిగిలిన 70శాతం ఉపయోగపడతాయి.

E L C కేశవరావు, ప్రధానోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మర్లపాలెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా. 9491100381.

EARNED LEAVE AND SURRENDER OF  EARNED LEAVE IMPORTANT RULES VIDEO



0 comments:

Post a Comment