Tuesday, July 30, 2019

GRAMASACHIVALAYAM- GENERAL DOUBTS

GRAMASACHIVALAYAM- GENERAL DOUBTS AND ANSWERS 


అభ్యర్థులకు  వచ్చే సాధారణ సందేహాలకు సమాధానాలు


* కనీస విద్యార్హతలో ఎటువంటి క్లాసులు/ గ్రేడ్ల నిబంధన లేదు. కాబట్టి ఏ క్లాస్‌లో లేదా ఏ గ్రేడులో పాసైనవారైనా దరఖాస్తు చేసుకోడానికి అర్హులే.

* కనీస అర్హతగా ఏదైనా డిగ్రీ అని పేర్కొన్న పోస్టులకి బీటెక్‌ వారు సహా అందరూ అప్లై చేసుకోవచ్చు.

* ప్రస్తుతం ప్రకటించిన పోస్టులకు స్థానికతను జిల్లా ఆధారంగా నిర్ణయిస్తారు.

* అభ్యర్థులు స్థానిక జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మరే ఇతర జిల్లాలోనైనా పరీక్ష రాయవచ్చు. దీని కోసం వంద రూపాయల ఫీజు అదనంగా చెల్లించాలి.

* మహిళా అభ్యర్థినులు వివాహానంతరం ఎక్కడ జీవిస్తుంటే అక్కడి సర్టిఫికెట్ల ఆధారంగా స్థానికత నిర్ణయిస్తారు. ఆ జిల్లాల్లో మాత్రమే నియామకాలు పొందే అవకాశం ఉంటుంది.

* అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో నాన్‌-లోకల్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయవచ్చు. అయితే నాన్‌-లోకల్‌ కేటగిరీ కింద ఉండే 20 శాతం పోస్టులకు స్థానికులతో కలిపి ఉమ్మడి మెరిట్‌ లిస్టు ప్రకారం ర్యాంకులను నిర్ణయిస్తారు.

* తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన వారు ఇప్పటికే సంబంధిత ఎమ్మార్వో దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండాలి. అటువంటి వారే స్థానిక అర్హత కలిగి ఉంటారు .అర్హులవుతారు.

* తెలంగాణలో చదువుకుని, అక్కడి స్థానికత ఉన్న వారికి ఈ పోస్టుల్లో ఎలాంటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లేదు.

* ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఈడబ్ల్యుఎస్, కాపు రిజర్వేషన్‌ల ప్రస్తావన లేదు. ఆ వాటాల కింద ఉద్యోగాలు పొందే వీలు లేదు.

* కనీస మార్కులు పొందితేనే ర్యాంకింగ్‌లోకి పరిగణనలోకి తీసుకుంటారు. కనీస అర్హత మార్కులు పొందకపోతే ఆ కేటగిరీలో ఖాళీలు మిగిలి ఉన్నప్పటికీ ఉద్యోగాలకు ఎంపిక చేయరు.

* ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అర్హులు కారు.1-7-2019 నాటికి విద్యార్హత పొందిన వారే అర్హులు.

0 comments:

Post a Comment