Tuesday, July 30, 2019

GRAMA SACHIVALAYA JOBS-NEW CANDIDATES PREPARATION PLAN

GRAMA SACHIVALAYA JOBS-NEW CANDIDATES PREPARATION PLAN


తాజా అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి


జనరల్‌ స్టడీస్‌ విభాగానికి వస్తే.... లభ్యమవుతున్న ఈ కొద్ది సమయంలో కింది అంశాలపై దృష్టి నిలిపితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

1. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌: దీనిలో ప్రశ్నలను గ్రూప్‌ 1, 2 స్థాయి మాదిరిగా కాకుండా దాదాపుగా బేసిక్‌ స్థాయిలో అడిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రాథమిక జ్ఞానానికి సంబంధించిన అంశాలతో సాధన చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎగ్జామ్‌ మాదిరిగా లోతైన ప్రిపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. ప్రతి రోజూ గంట సమయాన్ని ఈ విభాగానికి కేటాయిస్తే తేలికగా మార్కులు సాధించవచ్చు.

2. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు: గత ఆరు నెలల్లో జరిగిన అంశాలపై దృష్టి పెడుతూ క్రమం తప్పకుండా అంతర్జాతీయంగా, జాతీయంగా జరుగుతున్న ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. ఫలితంగా ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాలు: ప్రస్తుత ధోరణిని బట్టి ఎక్కువ స్థాయిలో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల నుంచి అడగటానికి అవకాశం ఉంది. కొద్దిరోజులుగా కొత్త ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై ప్రభుత్వ సమాచారం ఆధారంగా సిద్ధమైతే మంచి మార్కులు సాధించవచ్చు.

4. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు: పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాల నుంచి సులభమైన ప్రశ్నలను ఆశించవచ్చు. స్వల్పకాలంలో అధిక మార్కులు తెచ్చుకోగలిగిన విభాగం ఇది. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికానికి సంబంధించి భౌతిక, ఆర్థిక అంశాలపై శ్రద్ధ తీసుకుంటే మార్కులు సంపాదించుకోవచ్చు.

5. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర: ఈ విభాగం నుంచి కూడా ఎక్కువసంఖ్యలో ప్రశ్నలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ కొద్ది సమయంలో చిన్న చిన్న రాజ్య పరిపాలనలను పక్కన పెట్టాలి. ప్రధానంగా శాతవాహన రాజ్య వంశ చరిత్ర, విజయనగర ప్రభువుల పాలన, చోళులు , చాళుక్యులు, పల్లవుల పరిపాలనా యుగాలు , స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు మొదలైన కొద్ది అంశాలకు పరిమితమవ్వాలి. వివిధ రకాలైన కళల్లో, సాహిత్యంలో రాణించిన ప్రముఖ వ్యక్తుల గురించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

6. విభజనానంతర సమస్యలు: ఇవి ప్రస్తుత సిలబస్‌లో కూడా ప్రాధాన్యం పొందాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ విభజన సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న సహకార ధోరణిపై ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగం నుంచి 3-5 ప్రశ్నలను ఆశించవచ్చు.

7. వికేంద్రీకృత పరిపాలన: ప్రస్తుత ఈ ఉద్యోగాల వెల్లువ గ్రామ, వార్డు పరిపాలన కేంద్రాలుగా జరుగుతుంది. గ్రామస్థాయి పరిపాలన, వార్డు స్థాయి పరిపాలనలను బలోపేతం చేయటం ఈ ప్రయత్నం వెనుకున్న నేపథ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వికేంద్రీకృత పరిపాలనపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన పరిపాలన వ్యవస్థపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో నియమించబోతున్న ఉద్యోగులు ప్రజలకు ఏవిధమైన సేవలు అందించాల్సి ఉంటుందనేది ముందస్తుగానే ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. అందుకే పాలిటీ, గవర్నెన్స్‌ అనే విభాగం కింద 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన పరిపాలనా యంత్రాంగం, రాజ్యాంగ నిబంధనలపై కచ్చితంగా ప్రశ్నలను ఆశించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలో అభ్యర్థులు సిద్ధపడాలి.

కొత్తగా ప్రిపరేషన్‌ను ప్రారంభించిన అభ్యర్థులు ఇంతకుమించిన అంశాలపై ప్రస్తుత పరిస్థితుల్లో సన్నద్ధత కొనసాగించడం దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మొదటి అంచె, రెండో అంచెలో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని గట్టిగా ప్రిపేర్‌ అయితే విజయావకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 10, 2019.

0 comments:

Post a Comment