వాజ్‌పేయీ-జీవన ప్రస్థానం వీడియో
దిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిమ్స్ నుంచి నేరుగా వాజ్‌పేయీ నివాసానికి తరలించారు. వాజ్‌పేయీ నివాసం ఉన్న కృష్ణమీనన్ మార్గ్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారిమళ్లించారు. వాజ్‌పేయీ నివాసం వద్దకు భాజపా శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. వాజ్‌పేయీ నివాసం నుంచి రేపు ఉదయం 9గంటలకు భౌతికకాయాన్నిభాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు.