UDISE PLUS 2026-27 📢
Student Progression, Release & PEN Guidelines
UDISE PLUS 2026-27 లో Student Progression, Release Request, Class Change మరియు PEN Generate విషయాల్లో పాఠశాలలు తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్య సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి.
🔹 Student Release Request
Student Release Request Raise చేయాలంటే సంబంధిత School లో ముందుగా Progression పూర్తి చేసి ఉండాలి. Progression పూర్తయిన తర్వాత మాత్రమే Request Raise చేయవచ్చు.
అలాగే Request Approve చేయాలంటే ప్రస్తుతం విద్యార్థి చదువుతున్న School కూడా Progression పూర్తి చేసి ఉండాలి. లేకపోతే Request Raise చేసినా Approve చేయడం సాధ్యం కాదు.
⚠️ Finalize Progression తప్పనిసరి
కొన్ని పాఠశాలలో విద్యార్థులందరి Progression పూర్తి చేసినప్పటికీ School స్థాయిలో “Finalize Progression” చేయలేదు.
అలాంటి పాఠశాలలు వెంటనే School Level లో Progression Finalize చేయాలి.
🚫 Class Change Option ఇంకా Enable కాలేదు
UDISE PLUS లో ప్రస్తుతం Class Change Option అందుబాటులో లేదు.
కావున Pre-Primary విద్యార్థుల్లో 1వ తరగతి Age ఉన్న వారిని Drop చేయవద్దు.
పొరపాటున 1వ తరగతి లో Add చేయవలసిన విద్యార్థిని Pre-Primary లో Add చేసినట్లయితే, Class Change Option Enable అయ్యే వరకు వేచి ఉండాలి.
అలాంటి విద్యార్థులను మరలా New Entry కింద Add చేయడానికి గాని, Drop చేయడానికి గాని ప్రయత్నించవద్దు.
⚠️ PEN Generate విషయంలో జాగ్రత్త
ఒక పాఠశాలలో 1వ తరగతి కి New Entry Add చేసిన తర్వాత PEN Generate అవ్వకముందే Drop/Delete చేయవద్దు.
- అలా చేస్తే విద్యార్థికి PEN Generate కాదు.
- Drop చేసిన తర్వాత Import చేసుకోవడం సాధ్యం కాదు.
🆔 Aadhaar లేని విద్యార్థులు
Aadhaar లేని విద్యార్థులను కూడా Aadhaar స్థానంలో అన్ని 9 లు ఎంటర్ చేసి నమోదు చేయాలి.
అనంతరం జూన్ లోపు కొత్త Aadhaar తీసుకుని GP లో Update చేసుకోవాలి.