WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ఉపాధ్యాయులకు ముఖ్య సర్వీస్ రూల్స్ – ప్రశ్నలు & సమాధానాలు | AP Teachers Guide 2026

ఉపాధ్యాయులకు ఉపయోగకరమైన ముఖ్య ప్రశ్నలు – సమాధానాలు

⁉️ ప్రశ్న: పిహెచ్ అలవెన్స్ ఏ ఏ సందర్భాలలో కోత విధిస్తారు?
✅ జవాబు: సిఎల్ మినహా మిగిలిన సెలవులలో ఉన్నప్పుడు, వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలో పిహెచ్ అలవెన్స్ చెల్లించరు.
⁉️ ప్రశ్న: ఆగష్టు 15, జనవరి 26 రోజుల్లో హాజరు సంతకం/బయోమెట్రిక్ అవసరమా?
✅ జవాబు: అవసరం లేదు. ఇవి సెలవు దినాలు. అయితే పాఠశాల కార్యక్రమాలకు హాజరు కావాలి.
⁉️ ప్రశ్న: సర్వీస్ బుక్‌లో “సెన్సూర్” శిక్ష అంటే ఏమిటి?
✅ జవాబు: CCA Rule 9(i) మరియు GO MS No.53 (04-02-1997) ప్రకారం ఇది స్వల్ప దండన. 1 సంవత్సరం పాటు పదోన్నతికి అర్హత ఉండదు.
⁉️ ప్రశ్న: డెలివరీ & వెంటిలేషన్ ఖర్చులు మెడికల్ రీయంబర్స్ మెంట్‌లో క్లయిమ్ చేయవచ్చా?
✅ జవాబు: అవును. గరిష్టంగా ₹2 లక్షల వరకు క్లయిమ్ చేయవచ్చు. GO MS No.74 (15-03-2005) ప్రకారం డెలివరీ ఖర్చులు కూడా చెల్లిస్తారు. రిఫరల్ హాస్పిటల్ కావాలి.
⁉️ ప్రశ్న: ఇంటి నిర్మాణం పూర్తికాకముందే వడ్డీపై IT మినహాయింపు వస్తుందా?
✅ జవాబు: నిర్మాణం పూర్తయ్యాక మాత్రమే మినహాయింపు. ముందుగా చెల్లించిన వడ్డీని తర్వాత 5 సంవత్సరాలలో క్లయిమ్ చేయవచ్చు.
⁉️ ప్రశ్న: DSC ద్వారా కొత్త జిల్లాలో ఎంపికైతే వేతన రక్షణ ఉంటుందా?
✅ జవాబు: ఉన్నతాధికారుల అనుమతితో పరీక్ష రాసినట్లయితే వేతన రక్షణ ఉంటుంది.
⁉️ ప్రశ్న: పెన్షన్ కమ్యుటేషన్ పై సీలింగ్ ఉందా?
✅ జవాబు: పెన్షన్‌లో గరిష్టంగా 40% మాత్రమే కమ్యుట్ చేయవచ్చు. మొత్తం పై సీలింగ్ లేదు.
⁉️ ప్రశ్న: ట్యూబెక్టమీ సెలవు & పెటర్నిటీ లీవ్ రెండూ వాడుకోవచ్చా?
✅ జవాబు: అవును. రెండూ వేర్వేరు ప్రయోజనాల కోసం. ట్యూబెక్టమీ సెలవు వెంటనే, పెటర్నిటీ లీవ్ 6 నెలల్లో వాడుకోవచ్చు.
⁉️ ప్రశ్న: 240 రోజులకంటే ఎక్కువ కమ్యుటెడ్ లీవ్ వాడితే ఏమవుతుంది?
✅ జవాబు: Rule 15B(i) ప్రకారం 240 రోజులు మాత్రమే అనుమతి. అదనపు రోజులు అర్థజీతపు సెలవుగా మార్చి తేడా మొత్తాన్ని రికవరీ చేస్తారు.
AP teachers service rules Telugu PH allowance rules AP teachers teacher leave rules Andhra Pradesh commuted leave rules AP teacher pension rules AP DSC salary protection AP teachers medical reimbursement AP teachers AP teacher FAQ Telugu teacher rules and regulations AP Andhra Pradesh teacher benefits