WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

WARNING ABOUT CYBER PUSHING ATTACKS

 
కరోనా వైరస్ సహాయ‌ కార్యక్రమాల పేరిట సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ మెయిల్స్‌ పంపి ప్రజల్ని దోచుకునే అవకాశం ఉందని, ఆదివారం నుంచే ఈ సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు శనివారం ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ..‘‘ సైబర్‌ నేరగాళ్లు పంపిన హానికరమైన ఈ మెయిల్స్‌ను  క్లిక్‌ చేయగానే వారికి సంబంధించిన ఫేక్‌ వెబ్‌సైట్లలోకి వెళ్లిపోతాము. అక్కడ వారు మనల్ని హానికరమైన ఫైల్స్‌, యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరతారు. లేదా మన వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలను తెలుసుకుని మోసం చేస్తారు. సైబర్‌ నేరగాళ్ల దగ్గర దాదాపు రెండు మిలియన్ల భారత పౌరుల ఈ మెయిల్‌ ఐడీలు ఉన్నాయని సమాచారం. ( జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు )


వారు కోవిడ్‌-19 పరీక్షల పేరిట ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌లలోని వారి వ్యక్తిగత వివరాలను సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. నేరగాళ్లు అధికారుల, ప్రభుత్వాల ఈ మెయిల్‌ ఐడీలను పోలీన లేదా ఫేక్‌ ఐడీలతో రంగంలోకి దిగనున్నారు. ncov2019@gov.in లాంటి ఈ మెయిల్స్‌ ద్వారా ప్రజల్ని మోసం చేయోచ్చు. అయాచిత ఈ మెయిల్స్‌.. అవి మన కాంటాక్ట్‌ లిస్ట్‌కు చెందినవైనా సరే వాటిని తెరవకపోవటం ఉత్తమం. అయాచిత ఈ మెయిల్స్‌లోని యూఆర్‌ఎల్స్‌ను క్లిక్‌ చేయకపోవటం మంచిది. అనుమానం కలిగేలా ఏదైనా జరిగినా లేదా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినా వెంటే అన్ని వివరాలను incident@cert-in.org.in పంపాలి’’ అని తెలిపింది.