WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

AP DSC POSTPONED FOR TWO WEEKS/AP DSC 2018REVISED SCHEDULE

AP DSC POSTPONED FOR TWO WEEKS/AP DSC 2018REVISED SCHEDULE



డీఎస్సీ ప్రకటనకు పరీక్షకు మధ్య సమయం తక్కువగా ఉన్నందున చదువుకునేందుకు సమయం కావాలంటూ.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

అభ్యర్థుల వినతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు డిసెంబరు ఆరో తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. డీఎస్సీ అన్ని పోస్టులు కలిపి 7,729 ఉండగా వీటికి 6,08,157మంది దరఖాస్తు చేశారు.

ఉపాధ్యాయ నియామకాలకై నిర్వహించే ఏపీ డీఎస్సీ రెండు వారాల పాటు వాయిదా పడింది. వచ్చే నెల 19కి వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.


  • డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 
  • డిసెంబర్‌ 29 నుంచి జనవరి 4 వరకు ఎస్‌జీటీ పరీక్షలు, 
  • డిసెంబర్‌ 23,24 తేదీల్లో పీజీటీ పరీక్షలు,
  • డిసెంబర్‌ 26,27 తేదీల్లో టీజీటీ పరీక్షలు, 
  • డిసెంబర్‌ 28న లాంగ్వేజ్‌, పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు.